'హ్యారీపోటర్' సిరీస్ తరువాత ఆ చిత్రకథానాయకుడు డానియల్ రాడ్ క్లిఫ్ హీరోగా నటించిన తొలి హారర్ చిత్రం 'ది ఉమెన్ ఇన్ బ్లాక్'. ఎన్నో హారర్ చిత్రాలు నిర్మించిన హ్యామర్ ఫిలిం ప్రొడక్షన్స్ ఈ తాజా చిత్రాన్ని రూపొందించింది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఎస్‌విఆర్ మీడియా ప్రై.లి. సంస్థ ఈ సినిమాను ప్రేక్షకులకు అందిస్తోంది.
చిత్ర విశేషాలను సంస్థ అధినేత్రి శోభారాణి వెల్లడిస్తూ 'సరికొత్త కథ, కథనంతో రూపుదిద్దుకున్న సినిమా ఇది. తన కళ్ల ఎదుటే నీటిలో మునిగి చనిపోయిన బిడ్డ కోసం ఓ ఆత్మ తీర్చుకునే ప్రతీకారమే ఈ చిత్రకథాంశం. శిధిలావస్థకు చేరుకున్న ఓ బంగ్లాను అమ్మడానికి వచ్చి, ఒక రాత్రి అందులో బస చేసిన హీరోకు భయంకరమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. ముగింపు చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
అనుక్షణం ఉత్కంఠకు గురి చేసే సన్నివేశాలతో, భయకంపితులను చేసే కథనంతో దర్శకుడు జేమ్స్ వాట్కిన్స్ చిత్రాన్ని రూపొందించారు. ఫొటోగ్రఫీ, రీరికార్డింగ్ సినిమాకు ఎస్సెట్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెల్లో విడుదలయ్యే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది' అన్నారు. సుశాన్ హిల్ రాసిన నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో డానియల్ రాడ్‌క్లిఫ్, జానెట్ మెక్‌టీర్, సోఫీ స్టుకీ, లిజ్ వైట్ ఇతర ముఖ్యతారాగణం.

No comments:
Post a Comment