Pages

Friday

యాంటేజింగ్ ఉడ్డియానబంధ

కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ... మన ఆరోగ్యం విషయంలో కూడా టార్గెట్‌ను రీచ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంలో మళ్లీ ఓసారి యోగావల్ల కలిగే ప్రయోజనాలను పరిశీలిద్దాం.
1. స్ట్రెస్ నుంచి రిలీఫ్
2. ఫ్లెక్సిబిలిటీని ెపెరుగుతుంది
3. ఉదరభాగాన్ని (బలపరచడం) శక్తివంతం అవుతుంది
4. శరీరం, మనస్సు రెండింటి అనుసంధానం
5. మూడ్ యాక్టివేట్
6. ఏకాక్షిగత పెరుగుతుంది
7. బ్యాక్‌పెయిన్ తగ్గిస్తుంది
8. బీపీ తగ్గిస్తుంది
9. మంచి నిద్ర లభిస్తుంది
10. కూర్చునే, నిలుచునే పద్ధతి మెరుగవుతుంది
ఉడ్డియానబంధ
ముందుగా వజ్రాసనంలోగానీ, సుఖాసనంలోగానీ కూర్చోవాలి(నిల్చొని కూడా చేయవచ్చు). ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుని పొట్టను లోపలికి లాగిపట్టి, అదే స్థితిలో ఉండగలిగినంతసేపు (సుమారు 15 సెకన్లు) ఉండాలి. తరువాత నెమ్మదిగా పొట్టను యధాస్థితికి తెచ్చి, నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి. ఇలా కేవలం మూడు సార్లు మాత్రమే చేయాలి. నెమ్మదిగా అలవాటు అయిన తరువాత 3 నుంచి 10 సార్లు చేయొచ్చు.
ఉడ్డియానబంధ వేరియేషన్
తాడగి ముద్ర
వెల్లకిలా పడుకుని రెండు చేతుల తలమీదుగా చాచాలి. అరచేతులు ఆకాశం వైపుగా ఉంచాలి. కాలి మడమలను కిందగా వ్యతిరేక దిశలో తోస్తూ ఉండాలి. ఇప్పుడు గాలి పీల్చుకున్నట్లయితే పొట్ట లోపలికి వెళ్లి ఒక లోతైన గుంటలా మారుతుంది. దీనిని తాడగి ముద్ర అంటారు.
ఉపయోగాలు :
4 ఉదర కండరాలు, డయావూఫమ్‌ను దృఢపరుస్తుంది
4 ఆకలి పెరుగుతుంది
4 జీర్ణవ్యవస్థ నుంచి టాక్సిన్లను తొలగిస్తుంది
4 మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది
4 శరీరంను వృద్ధాప్యపు ఛాయల నుంచి కాపాడుతుంది
జాగ్రత్తలు :
4 హెర్నియా ఉన్నవాళ్లు చేయకూడదు

No comments:

Post a Comment