Pages

Monday

రవితేజ సినిమా కోసం భారీ సెట్స్


 రవితేజ కోసం యమలోకం రెడీ అవుతోంది. కంగారుపడకండి... రవితేజ నటిస్తున్న 'దరువు' సినిమా కోసం మాత్రమే ఈ యమలోకం సెట్ వేస్తున్నారు. హైదరాబాదు సమీపంలోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సెట్ ను ఎరెక్ట్ చేస్తున్నారు. 'శౌర్యం' శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ 'దరువు' సినిమా సోషియో ఫ్యాంటసీ కథాంశంతో మిళితమై సాగుతుందట. కథలో భాగంగా యమలోకం సీన్స్ వున్నాయని తెలుస్తోంది. ఇవి చాలా కామెడీగా, ఎంటర్ టైనింగ్ గా ఉంటాయని అంటున్నారు. ఇందులో తమిళ నటుడు ప్రభు యముడుగా నటిస్తున్నాడట. ఈ సినిమాలో హీరో రవితేజ ఐదు రకాలుగా కనిపిస్తాడు. అతని సరసన తాప్సీ కథానాయికగా నటిస్తోంది. బూరుగుపల్లి శివరామకృష్ణ దీనిని నిర్మిస్తున్నారు. పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ 'దరువు' సినిమాకి 'సౌండాఫ్ మాస్' అనేది ట్యాగ్ లైన్.

No comments:

Post a Comment