గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న బాలీవుడ్ జంట కరీనా కపూర్, సయీఫ్ అలీ ఖాన్ త్వరలో పెళ్లి బంధాన్ని ముడివేసుకోనుంది. తమ పెళ్లికి ఇక సమయం ఆసన్నమైందని ఇద్దరూ గుర్తించారని వాళ్ల సన్నిహితులు అంటున్నారు. అన్నీ కుదిరితే ఇక కొన్ని నెలల్లో వివాహ బంధంతో వీరిద్దరూ ఒకటి కానున్నారని తెలుస్తోంది. కరీనా కుటుంబంతో సయీఫ్ చక్కని రిలేషన్ ని ఏర్పరచుకున్నాడు. అలాగే, కరీనా కూడా సయీఫ్ ఫ్యామిలీతో ముఖ్యంగా అతని మొదటి భార్య పిల్లలతో ఒక బంధాన్ని పెంచుకుంది.
అసలు ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సిన ఈ జంట, తమ పెళ్లితో కరీనా సినిమా కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందోనన్న అనుమానంతో ఇన్నాళ్లూ వాయిదావేసుకుంటూ వచ్చారు. ఇప్పుడిక పెళ్లి చేసుకున్నా కరీనా కెరీర్ కి వచ్చే ముప్పేమీ లేదని గ్రహించడంతో పెళ్లికి ఇద్దరూ ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి తోడు, వీరిద్దరి మధ్యా గొడవలొచ్చాయంటూ ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలు కూడా వీరు త్వరగా పెళ్లి చేసుకునేలా పురిగొల్పాయని అంటున్నారు.

No comments:
Post a Comment