అమెరికా శ్వేత సౌధాధిపతి పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం రేసులో మిట్ రోమ్నీ (64) పేరు దాదాపు ఖరారైనట్టే. ఇందులో భాగంగా నెవాడా రాష్ట్రంలో నిర్వహించిన ఓటింగ్‌లో తన ప్రత్యర్థులపై భారీ తేడాతో ఆయన ముందంజ వేశారు. ఈ ఏడాది నవంబర్ 6న జరిగే ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాతో తలపడటానికి ఈ మసాచుసెట్స్ మాజీ గవర్నర్ సిద్ధమవుతున్నారు. మంగళవారం ఫ్లోరిడాలో నెగ్గిన ఆయన, తాజాగా నెవాడాలో రెండో నిర్ణయాత్మక విజయం సాధించారు.
ఇప్పటిదాకా లెక్కించిన 47 శాతం ఓట్లలో 42.6 శాతంతో ప్రధాన ప్రత్యర్థి గింగ్రిచ్‌సహా మిగిలిన ముగ్గురికీ అందనంత ఎత్తులో నిలిచారు. ఈ సందర్భంగా తన ప్రచార కేంద్రం లాస్‌వెగాస్‌లో రోమ్నీ మాట్లాడుతూ- నెవాడా ఓటర్లు 2008లోనూ తనను సమర్థించారని గుర్తుచేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. వారు తనపై ఉంచిన దృఢమైన నమ్మకాన్ని ఈసారి శ్వేతసౌధానికి తీసుకెళతానని ధీమా వ్యక్తం చేశారు. ఒబామా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మింగేస్తూ కోటానుకోట్ల డాలర్ల లోటుకు బాటలు వేస్తున్నదని దుయ్యబట్టారు. అధ్యక్షుడిగా ఎన్నికైతే తన 'ఉద్యోగం' గురించి కాకుండా ప్రజల ఉపాధి గురించి ఆలోచించేందుకే అగ్ర ప్రాధాన్యం ఇస్తానని వాగ్దానం చేశారు.

No comments:
Post a Comment