Pages

Saturday

శ్రియా అన్నట్టుగానే జరిగిందిప్పుడు...!


శ్రియా అన్నంత పనీ జరిగింది. అక్షరాలా తను చెప్పినట్టుగానే జరిగింది. ప్రముఖ నటుడు కమలహాసన్ నటిస్తోన్న ‘విశ్వరూపం’ సినిమాలో మొదట్లో సెకండ్ హీరోయిన్ గా శ్రియాని అనుకున్నారు. ఆమెతో మాట్లాడడం, ఆమె ఎగిరిగంతేసి ఓకే చెప్పేయడం, పారితోషికం మాట్లాడేసుకోవడం అన్నీ జరిగిపోయాయి. అయితే, అగ్రిమేంటే మాత్రం జరగలేదు. అప్పటికే ఈ వార్త మీడియాలో వచ్చేసింది. ఇదే శ్రియాని అడిగితే, మీడియాకు చాలాసేపు క్లాసు పీకింది.
“ఏదీ పక్కాగా ఓకే కానిదే నేను చెప్పను. ఒకవేళ చెప్పాననుకోండి… తర్వాత ఆ ప్రాజక్టులోంచి ఏదో కారణంతో నేను తప్పుకున్నాననుకోండి… శ్రియాను తీసేశారంటూ మీరు రాసేస్తారు. ఈమధ్య ‘మిస్టర్ నోకియా’ సినిమా విషయంలో మీడియా అలాగే చేసింది”  అంటూ పెద్ద లెసన్ చెప్పింది. సరిగ్గా ఇప్పుడు అలాగే జరిగింది. తాజాగా ఈ సినిమాలో శ్రియాను కాకుండా,  ఇషా శర్వాణీని తీసుకున్నారు. దాంతో శ్రియాను తొలగించారంటూ కోలీవుడ్ మీడియా అప్పుడే రాసేస్తోంది. ఇప్పుడిక  శ్రియా ఎలా స్పందిస్తుందో చూడాలి!

No comments:

Post a Comment