Pages

Monday

అమలాపాల్ ... అంతొద్దు అంటోన్న కోలీవుడ్


 అమలాపాల్ ... ఇప్పుడు ఈ పేరుకి ఇటు తెలుగులోనూ అటు తమిళ్ లోనూ మంచి డిమాండ్ ఉంది. తెలుగులో ఈ అందాల రాసి చేసిన 'బెజవాడ'... పెద్దగా ఆడక పోయినప్పటికీ అవకాశాలు ఆగకుండా బాగానే వస్తున్నాయి. సిద్ధార్థ సరసన ఆమె నటించిన 'లవ్ ఫెయిల్యూర్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ అమ్మడు తమిళ్ సినిమాలతో ప్రస్తుతం చాలా బిజీగావుంది. రీసెంట్ గా ఆమె నటించిన తమిళ్ సినిమా 'వెట్టయ్' చిత్రం పెద్ద విజయం సాధించించడంతో ఒక్కసారిగా ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది.
       కాగా, అమలాపాల్ సినిమాల సంఖ్యే కాదు... ఆమె అహంకారం కూడా పెరిగిపోయిందనే వార్తలు కోలీవుడ్ లో  వినిపిస్తున్నాయి. విషయమేవిటంటే ... సూర్య హీరోగా చేస్తోన్న 'సింగం-2 సినిమాలో కథానాయికగా అవకాశం రావడంతో మొదట ఆనందంగా అంగీకరించిందట. అయితే ఆ తరువాత ఈ సినిమాలో మరో కథానాయికగా అనుష్క నటిస్తోందని తెలిసి డేట్స్ ఖాళీ లేవుంటూ మాట మార్చింది. దాంతో నిర్మాతలు ఏ మాత్రం బతిమాలకుండా నేరుగా వెళ్లి ఆ పాత్రకి హన్సికని ఎంపిక చేసుకోవడం కూడా ఆమెకి మింగుడు పడటంలేదని అంటున్నారు. చేతిలో సినిమాలు వున్నాయి కదా అని రెచ్చిపోతే పరభాషా చిత్రాల వైపు పరిగెత్తాల్సి వస్తుందని కోలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయని తెలుస్తోంది. మరి ఈ విషయంపై అమలాపాల్ ఎలా స్పదిస్తుందో ఏమో!

No comments:

Post a Comment