Pages

Friday

జెనీలియాకు 'హనీమూన్' గిఫ్ట్


ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడంలో బాలీవుడ్ హీరోలలో సల్లూ భాయ్... అదే మన సల్మాన్ ఖానే ముందుంటాడు. పైగా, సర్ ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇస్తుంటాడు. మొన్ననే పెళ్లి చేసుకున్న జెనీలియా, రితేష్  జంటకు కూడా వారు ఊహించని విధంగా వెడ్డింగ్ గిఫ్ట్ ఇచ్చాడట. వాళ్ల హనీమూన్ ప్యాకేజ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడని బాలీవుడ్ సమాచారం. ఈ జంట త్వరలోనే హనీమూన్ కి వెళుతోంది. ఇదిలా ఉంచితే, ఇంతకీ సల్మాన్ మాత్రం వీరి పెళ్లికి హాజరుకాలేకపోయాడు. షూటింగ్ నిమిత్తం క్యూబాలో ఉండిపోవడం వల్ల రాలేకపోయాడట. త్వరలోనే వచ్చి ఇద్దరికీ బెస్ట్ విషెస్ చెబుతాననీ, ఈలోగా వాళ్ళిద్దర్నీ నచ్చిన చోటుకి వెళ్లి హనీమూన్ ఎంజాయ్ చేసి రమ్మని చెప్పాడట. ఇంకా పెళ్లి చేసుకోకపోయినా మనవాడికి ఈ మర్యాదలన్నీ బాగానే తెలుసు కదా?

No comments:

Post a Comment