గతంలో చిరంజీవి-బాలకృష్ణ మధ్య తలెత్తిన మనస్పర్ధలు ఆ తర్వాత రాజకీయ రంగు పులుముకుని రచ్చకెక్కాయి. ఏదో ఓ పార్టీలో చేరి చిరంజీవిని టార్గెట్ చేయాలనుకున్న రాజశేఖర్ కి అన్నిదార్లూ మూసుకుపోవడంతో ఇక బాలకృష్ణతో బంధం తప్పనిసరైంది. దాంతో ఈ మధ్య బాలకృష్ణకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలోనూ రాజశేఖర్ కనిపిస్తున్నారు. ఈ రోజు కేన్సర్ నిర్మూలనా దినోత్సవం సందర్భంగా బాలకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన ర్యాలీలోనూ ఆయన పాల్గొన్నారు. బాలకృష్ణ ఆధ్వర్యంలో బసవతారకం కేన్సర్ హాస్పిటల్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకూ కేన్సర్ అవేర్నెస్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ... కేన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించాలనీ ... అప్పుడే ఈ వ్యాధిని కొంతవరకు నిర్మూలించగలమని అన్నారు. రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి ప్రారంభించిన ఈ ర్యాలీలో ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, బ్యాడ్మెంటెన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, నటులు మురళీ మోహన్, రాజశేఖర్, అలీ తదితరులు పాల్గొన్నారు. వరస సినిమాలతో బిజీబిజీగా వున్న బాలకృష్ణ ఈ ర్యాలీని నిర్వహించడం పట్ల పలువురు సామాజిక వేత్తలు హర్షాన్ని ప్రకటించారు.
No comments:
Post a Comment