తన రెండు దశాబ్దాల సినీ జీవితంలో ఎప్పుడూ రీమేక్స్ ముట్టని తమిళ దర్శకుడు శంకర్ తాజాగా 'త్రీ ఇడియట్స్' హిందీ చిత్రాన్ని రీమేక్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే వ్రతం చెడినా ఫలితం మాత్రం దక్కనందుకు శంకర్ ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నాడు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఆహా... ఓహో అంటూ పబ్లిసిటీ పొందినా, ప్రేక్షకుల్ని మాత్రం ఆకట్టుకోలేకపోతోంది. మరీ ముఖ్యంగా శంకర్ అభిమానులు ఈ సినిమా చూసి పెదవి విరిచేస్తున్నారు. మా శంకరేంటి... ఇలాంటి సినిమా తీయడమేంటి... అంటూ తలలు బాదుకుంటున్నారట.
దీనిని దృష్టిలో పెట్టుకునే, 'ఇకపై రీమేక్స్ చచ్చినా చేయను' అంటూ శంకర్ తాజాగా స్టేట్మెంట్ ఇచ్చాడు. 'రోబో' సినిమా షూటింగు సమయంలో పూనాలో ఈ సినిమా చూసి, అనుభూతి చెందాననీ, ఆ అనుభూతిని తమిళ ప్రేక్షకులకి కూడా అందించాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ రీమేక్ చేశాననీ వివరణ ఇచ్చుకున్నాడు. ఈ చిత్ర నిర్మాణం తనకొక కొత్త అనుభవాన్ని ఇచ్చిందని చెప్పాడు. చిరంజీవి నటించే 150 వ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడంటూ వస్తున్న వార్తలని ఆయన దృష్టికి తీసుకువెళితే, ప్రస్తుతం తాను హాలిడే ఎంజాయ్ చేస్తున్నానని నవ్వుతూ చెప్పాడు శంకర్.

No comments:
Post a Comment