Pages

Tuesday

సంతాన సాఫల్యానికి డి విటమిన్...


ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్.. ఇది మన పూర్వులు చెప్పిన మాట. పాశ్చాత్య పరిశోధకులూ ఒప్పుకొన్న నిజం. ఇప్పుడింకో పరిశోధనలోనూ అదే తేలింది. సూర్యకిరణాల నుంచి లభించే డి విటమిన్.. పురుషుల్లోనూ, స్త్రీలలోనూ సంతాన సాఫల్య శక్తిని పెంచుతుందని మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ గ్రాజ్ (ఆస్ట్రియా) పరిశోధకుల అధ్యయనంలో తేలింది. డి విటమిన్ పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను పెంచుతుందని, మహిళల్లో హార్మోన్ల అసమతౌల్యాన్ని సరిచేసి సంతాన సాఫల్య శక్తిని పెంచుతుందని వివరించారు. డి విటమిన్ లోపం కారణంగా సంతానభాగ్యం పొందలేకపోతున్నవారు ఖరీదైన చికిత్సల వెంట పరుగులు తీయకుండా... నిత్యం సూర్యకాంతిని పొందగలిగితే ఫలితం ఉంటుందని సూచించారు. 

దీనివల్ల మహిళల సెక్స్ హార్మోన్లయిన ప్రొజెస్టిరోన్ 13 శాతం, ఈస్ట్రోజన్ 21 శాతం మేర పెరుగుతాయని, రుతుచక్రం సవ్యంగా ఉంటుందని విశ్లేషించారు. అదేవిధంగా ఎండలో కాసేపు గడపడం వల్ల పురుషుల సెక్స్ హార్మోన్ అయిన టెస్టోస్టీరాన్ స్థాయులు పెరుగుతాయట. అయితే, ఉదయపు ఎండలో కాసేపు ఇలా గడిపితే సరిపోతుందని, అదేపనిగా తీక్షణమైన ఎండలో ఎక్కువసేపు గడిపితే ఇతరత్రా సమస్యలు వస్తాయని హెచ్చరించారు. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీలో వారి పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి.

No comments:

Post a Comment