Pages

Monday

గిలానీ.. కోర్టుకు రా! పాక్ సుప్రీం కొరడా.. ధికార నోటీసు జారీ జర్దారీ మీద కేసు తెరవకపోవడంపై కన్నెర్ర...


 పాకిస్థాన్‌లో ప్రభుత్వాని కీ, న్యాయ వ్యవస్థకూ మధ్య వివాదం మరింత ముదిరింది. ప్రధాని యూసుఫ్ రజాగిలానీ, అధ్యక్షుడు జర్దారీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తమ ఆదేశాల మేర కు జర్దారీతోపాటు 8 వేలమందిపై ముడుపుల కేసును ఎందుకు తిరిగి తెరవలేదని కోర్టు గిలానీని ప్రశ్నించింది. ఈ కేసులో గురువారం స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. 

చీఫ్ జస్టిస్ నసీరుల్ ముల్క్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సోమవారం ఆయనకు ధిక్కార నోటీసు జారీ చేసింది. "ముడుపుల కేసును మళ్లీ తెరవాలని చాలామార్లు ఆదేశించినా, ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగానే ధిక్కరించింది'' అని ధర్మాసనం పేర్కొంది. మెమోగేట్, సైన్యంతో వైరం, న్యాయవ్యవస్థ తో ఘర్షణ... ఇన్ని పరిణామాల నేపథ్యంలో సర్కారు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారగా, సుప్రీం ఆదేశాలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. 

కోర్టుకు వెళతా...
కోర్టు ఆదేశాలను ప్రధానికి, అధ్యక్షుడికి తెలియచేశానని అటార్నీ జనరల్ అన్వరుల్ హఖ్ పేర్కొన్నప్పుడు ధర్మాసనం మరింత మండిపడింది. "కేవలం అదొక్కటే మీ బాధ్యత కాదు. ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేసేలా చూడాల్సిందీ మీరే'' అని చీఫ్‌జస్టిస్ మండిపడ్డా రు. కాగా, కోర్టు ఉత్తర్వు వెలువడగానే అధ్యక్షుడు జర్దారీతో, సంకీర్ణంలోని ముఖ్యనేతలతో గిలానీ భేటీ అయ్యా రు. ఆయన కోర్టుకు హాజరు కావాలని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతోపాటు మిత్రపక్షాలు తీర్మానించాయి. మరోవైపు సాయంత్రమే పార్లమెంటు సమావేశం నిర్వహించి 'పార్లమెంటే అత్యున్నతం' అనే సందేశంతో గిలానీ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. 

25వరకు గడువు కోరిన ఇజాజ్
'మెమోగేట్'ను బయటపెట్టిన అమెరికాలోని పాక్ సంతతి వ్యాపారి మన్సూర్ ఇజాజ్ మరోసారి 'వాయిదా' కోరారు. సుప్రీం నియమించిన కమిషన్ ఎదుట మంగళవారం ఆయన వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. కానీ... ఇజాజ్ న్యాయవాది ఈ నెల 25వరకు గడువు కోరారు. అయితే... ఇజాజ్‌కు పాక్ వచ్చే ఉద్దేశమే లేదని, రకరకాల సాకులతో తప్పించుకుంటున్నారని అమెరికాలో పాక్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ తరఫు న్యాయవాది ఆరోపించారు. 

లాడెన్ హతమయ్యాక సైనిక తిరుగుబాటు జరగవచ్చనే అనుమానంతో, పరిస్థితిని గాడిన పెట్టేందుకు హక్కానీ అమెరికా సహాయం కోరినట్లుగా లేఖను ఇజాజ్ బయటపెట్టారు. ఆ తర్వాత హక్కానీ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ 'మెమో'పై సుప్రీం విచారణ జరుపుతోంది. ఇజాజ్ 25వరకు గడువు కోరిన నేపథ్యంలో... 26న హాజరు కావాల్సిందిగా పాక్ పార్లమెంటరీ కమిటీ ఆయనకు సమన్లు పంపింది. మరోవైపు మన్సూర్ ఇజాజ్, హుస్సేన్ హక్కానీల మధ్య ఫోన్ సం భాషణలు, ఎస్ఎమ్మెస్‌ల సమాచారాన్ని ఇచ్చేది లేదని బ్లాక్ బెర్రీ సంస్థ స్పష్టం చేసింది. 

సైనిక పాలనకే ముషార్రఫ్ జై
ఏ గూటి పిట్ట ఆ గూటి పాటే పాడుతుందన్నట్లు పాక్‌లో సైనిక తిరుగుబాటు జరిగి ఉంటే సైన్యానికే మద్ద తు ప్రకటించేవాడినని ముషార్రఫ్ తెలిపారు. "సైన్యానికి ఆ ఆలోచన లేదనే అనుకుంటున్నాను. నేను ఆర్మీ మనిషిని. ఆర్మీకి వ్యతిరేకంగా చిన్న ఆలోచన కూడా చేయలేను. సైనిక పాలనే వస్తే... మద్దతుగా నిలుస్తా'' అని ఓ చానల్‌కు తెలిపారు. రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌తో దోస్తీకి తాను సిద్ధమేనని... అయితే, అధికారంలోకి వస్తే మాత్రం ఆయన కింద పని చేసేది లేదని స్పష్టం చేశారు. 

ముషార్రఫ్‌ను చంపితే 10.1 కోట్ల నజరానా
ఇస్లామాబాద్: మరో పది రోజుల్లో స్వదేశం రానున్న ముషార్రఫ్‌కు బెలూచిస్థాన్ నేత షాజైన్ బుగ్తీ షాక్ ఇచ్చా రు. "ముషార్రఫ్ తల నరికి తెస్తే పది లక్షల నగదు, పది కోట్ల విలువైన బంగళా బహుమతిగా ఇస్తాం. చంపిన వారికి పూర్తి భద్రత కూడా కల్పిస్తాం'' అని ప్రకటించా రు. బెలూచిస్థాన్ జాతీయ నేత అక్బర్ బుగ్తీ మనవడే షాజైన్ బుగ్తీ. 2006లో ముషార్రఫ్ హయంలో జరిగిన సైనిక దాడిలో అక్బర్‌బుగ్తీ సహా అనేక మంది బెలూచిస్థాన్ నేతలు మరణించారని ఆయన గుర్తుచేశారు.

No comments:

Post a Comment