Pages

Tuesday

టిబెట్ ఆలయాలపై చైనా నియంత్రణ చర్యలు తీవ్రం


టిబెట్‌లోని బౌద్ధాలయాలు, ఆరామాలపై నియంత్రణాచర్యలను చైనా కఠినతరం చేసింది. సిచువాన్‌లో ఇటీవల సన్యాసులు కొందరు 'ఆత్మత్యాగం' చేసుకోవడంతో ఈ చర్యలను చేపట్టిన చైనా, సమస్యలు సృష్టించేవారని ఈ ప్రాంతంలో ప్రవేశించనీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది. సిచువాన్‌లో ఇటీవల ఇద్దరి మృతికి దారి తీసిన పోలీసుకాల్పులను 'చైనా డైలీ' సమర్థించింది. టిబెటన్ నాయకుడు దలైలామా పేరు నేరుగా ప్రస్తావించకుండా ఈ నిరసనలకు 'ధర్మశాల' వత్తాసు ఉందని ఆరోపించింది.

రాజధాని లాసాలో ఉన్నతాధికారి కీఝలా జారీ చేసిన ఆదేశాల్లో ఆలయాలు, ఇతర చోట్ల జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ లాసా శాఖ కార్యదర్శి అయిన కీ.. సిచువాన్ నుంచి టిబెట్‌లోకి ప్రవేశమార్గమైన మొఝుగొంగ్కా వద్ద ఈ మేరకు ఆదేశించినట్టు 'లాసా డైలీ' పత్రిక పేర్కొంది. ఈ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు టిబెట్ స్వయంప్రతపత్తి ప్రాంత వెబ్‌సైట్ పేర్కొంది.

No comments:

Post a Comment