ఊరుగాని ఊళ్లో.. ఎక్కడో రోడ్డు మీద ఉన్నప్పుడు అర్జెంటుగా 'ప్రకృతి' పిలుస్తుంది! కడుపులో భారాన్ని దించుకుంటే తప్ప కదల్లేని స్థితి వస్తుంది. అప్పటికప్పుడు మరుగుదొడ్లు ఎక్కడున్నాయో ఎలా తెలుస్తుంది? మామూలు మనుషులకు ఈ సమస్య వస్తే ఎవరో ఒకరిని దగ్గర్లో ఎక్కడైనా టాయిలెట్ల సదుపాయం ఉందేమో కనుక్కుని, కడుపుబ్బరం భారాన్ని దించుకుంటారు. అదే సమస్య టెక్ చదువులు చదువుకున్న విద్యార్థులకొస్తే అక్కడితో ఆగిపోరు. టెక్నాలజీ సాయంతో ఆ సమస్యకు పరిష్కార మార్గాలు వెతుకుతారు.
యూనివర్సిటీ ఆఫ్ ఆమ్‌స్టెర్‌డామ్ (నెదర్లాండ్స్)కు చెందిన ముగ్గురు విద్యార్థులు అదే పని చేశారు. 'హూగ్ నూడ్'.. అంటే, 'వెంటనే తీర్చుకోవాల్సిన అవసరం' పేరుతో ఒక స్మార్ట్ ఫోన్ అప్లికేషన్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. అవసరం వచ్చినప్పుడు దాన్ని రన్ చేస్తే ప్రభుత్వ సమాచారం మేరకు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ మరుగుదొడ్ల సమాచారాన్ని డిస్‌ప్లే చేస్తుంది. డిపార్ట్‌మెంటల్ స్టోర్లలో ఉండే సెమీ-పబ్లిక్ టాయిలెట్ల సమాచారం కూడా అందులో లభ్యమవుతుంది.

No comments:
Post a Comment