Pages

Friday

జీవిత చరిత్రతో రజనీ పుస్తకం


సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు సంబంధించిన విశేషాలు, ఆయన గురించి ఇంతవరకు ఎవరికీ తెలియని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఆయన జీవిత చరిత్ర ఓ పుస్తకంగా రానుంది. టీవీ షోల నిర్మాత నామన్ రామచందరన్ రచించిన ఈ పుస్తకాన్ని పెంగ్విన్ బుక్స్ ఇండియా సంస్థ ప్రచురిస్తోంది. 

తొలి సినిమా నుంచి త్వరలో రాబోతున్న 'రాణా' వరకు సినీ రంగంలో రజినీ ప్రస్థానం, ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు, అరుదైన ఫొటోలతో ఈ పుస్తకం అభిమానులను విశేషంగా ఆకట్టుకోనుందని పెంగ్విన్ సంస్థ పేర్కొంది. సినీ జగత్తులో అగ్రస్థానంలో నిలిచిన రజినీకాంత్.. సాధారణ వ్యక్తిగా కనిపించే తీరు, వెండితెరపై ఆయన చేసే మ్యాజిక్ వంటి అంశాలను కూడా రచయిత విశ్లేషించారని పబ్లిషర్లు తెలిపారు. 

రజినీ స్టైల్‌లోనే పుస్తకాన్ని కూడా ప్రత్యేక తేదీ 12.12.12 నాడే విడుదల చేయడానికి పెంగ్విన్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. అదే రోజు సూపర్‌స్టార్ 62వ పుట్టిన రోజు కూడా కావడం విశేషం.

No comments:

Post a Comment