ఛత్తీస్‌గఢ్‌లో 'పత్రిక' అనే వార్తా పత్రిక నడవకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తూ భయపెడుతోందని ఇండియన్ న్యూస్ సొసైటీ (ఐఎన్ఎస్) మంగళవారం ఆరోపించింది. పత్రికపై ప్రభుత్వ దాడిని ఖండిస్తున్నట్లు ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ ఆశిష్ బగ్గా తెలిపారు. సీఎం రమణసింగ్, ఆయన బంధువులు కక్ష కట్టి పత్రికను అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే పత్రికకు వ్యతిరేకంగా 40 నుంచి 50 కేసులు నమోదయ్యాయని..
Pages
▼
Wednesday
వార్తా ప్రతికపై కక్షగట్టిన ఛత్తీస్‌గఢ్
ఎక్కువగా గిరిజన ప్రాంతమైన బస్తర్ జిల్లాకు చెందినవేనని ఆయన చెప్పారు. అంతే కాకుండా అధికార పార్టీ కార్యకర్తలు పత్రిక ప్రతులను దగ్ధం చేస్తూ.. హోర్డింగ్‌లను తొలగిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని చెప్పారు. రమణ్‌సింగ్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతూ విద్వేషపూరితంగా వ్యవహరిస్తోందని.. పత్రికా స్వేచ్ఛ కు భంగం కలిగించడం మంచి పద్దతి కాదని ఆశిష్ బగ్గా అన్నారు.
No comments:
Post a Comment