ఇటలీ తీరంలో ప్రమాదానికి గురైన కోస్టా కంకార్డియా లగ్జరీ క్రూయిజ్ నౌక సోమవారం నాటికి పూర్తిగా మునిగి సముద్రం అడుగుభాగానికి చేరిపోయింది. దీనితో ప్రయాణికులను గాలించే చర్యలను నిలిపివేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఒక భారత నావికునితో సహా ఇంకా 41 మంది ఆచూకీ తెలియలేదు. 201 మంది భారత నావికులతో పాటు మిగతా వారందరినీ కాపాడగలిగారు. వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ ఆదేశించారు.
ఇదిలా ఉండగా కెప్టెన్ ఫ్రాన్సెస్కో స్చెట్టినోను, ఫస్ట్ ఆఫీసర్‌ను ఇటలీ పోలీసులు అరెస్టు చేశారు. చివరి ప్రయాణికుడిని రక్షించే వరకు నౌకలో ఉండాల్సిన కెప్టెన్, నౌకను విడిచిపెట్టి పోయిన కారణంగా ఆయనను అరెస్టు చేశారు. ఈ ప్రమాదం కారణంగా క్రూయిజ్ కంపెనీకి ఇప్పటికిప్పుడు 85 నుంచి 95 మిలియన్ డాలర్ల (433.5 నుంచి 484.5 కోట్ల రూపాయల) నష్టం వాటిల్లినట్టు తెలిపారు. రెండేళ్ల కిందట ఈ నౌక కెప్టెన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను టైటానిక్ కెప్టెన్ చేసినటువంటి తప్పును చేయదలచుకోలేదని చెప్పడం గమనార్హం.

No comments:
Post a Comment