టీకాలను భారీ ఎత్తున వేసే సంవత్సరంగా ఈ 2012ను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దేశంలోని మారుమూల, వెనుకబడిన ప్రాంతాలు, మురికివాడల్లోని పిల్లలందరికీ టీకాలు వేసితీరాలనేది ప్రభుత్వ యోచన. అందుకు తగిన పథకాలు సిద్ధం చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం దేశంలోని 61 శాతం మందికే టీకాలు అందుబాటులోకి వచ్చాయని గమనించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఈ2012లో ఎలాగైనా సరే దేశంలోని పిల్లలందరికీ నూటికి నూరుశాతంగా టీకాలు వేయాలని, ఇందుకు ఇప్పటి టీకా కార్యక్రమ వేగతీవ్రత పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకొంది.
No comments:
Post a Comment