Pages

Saturday

ఇష్టం లేకపోతే మీ రాష్ట్రాలలో అనుమతించకండి

ఎఫ్‌డిఐకి అనుమతిపై తృణమూల్‌, డిఎంకెలపై పరోక్ష దాడి

న్యూఢిల్లీ:- మల్టీ బ్రాండ్‌ రిటైలింగ్‌ లో 51శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతించే రాష్ట్రాలను అడ్డుకోవద్దని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ మిత్రపక్షాలను, ప్రతి పక్షాలను కోరారు. పార్లమెంటులో ఓటింగ్‌ను ప్రవేశపెట్టడానికి అవసరమైన సర్దుబాట్లు చేస్తున్నామని ఆయన శుక్రవారం నాడు ఒక సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. ఆయా రాష్ట్రాలు తమ సొంత రాష్ట్రంలో తమ అభి ప్రాయాలను అమలు చేయవచ్చునని, ఇతర రాష్ట్రాలపై తమ అభిప్రాయాలను రుద్దడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. పార్ల మెంటులో రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐని అను  మతించడంపై కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఆ నేపథ్యంలో ప్రణబ్‌ముఖర్జీ చేసిన ప్రకటనకు ప్రాముఖ్యత ఏర్పడింది. యుపిఏ ప్రభుత్వంలో భాగస్వాములు అయిన తృణ  ముల్‌ కాంగ్రెస్‌, డిఎమ్‌కె కూడా ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నది. ప్రణబ్‌ ముఖర్జీ చేసిన ప్రకటన ఈ రెండు మిత్ర పక్షాలకు అన్వయి స్తుందని భావించవచ్చు. స్వార్థ రాజకీయాలతో విధానపరమైన మార్పులను కొందరు వ్యతిరే  కిస్తున్నారని, ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను దశలవారీగా, సున్నితంగా తీసుకుంటున్నప్పటికీ అడ్డంకులు కల్పించడం సబబుగా లేదని వ్యాఖ్యానించారు.
ఇండియా అమెరికా పౌర అణుఒప్పందం మాదిరిగానే రిటైల్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి  బిల్లును కూడా ఆమోదింప చేసుకునే అవకాశాలు లేకపోలేదని ముఖర్జీ స్పష్టం చేసా రు. పైకి ఈ బిల్లును ఆమోదింప చేసుకునే అవకాశాలు లేనట్లు కల్పించినా చర్చలు అనంత  రం రాజకీయపార్టీలు కొంత మేర సర్దుబాటు చేసుకోవచ్చునని ఆయన అన్నారు. అయితే ఈ బిల్లును కచ్చితంగా ఆమోదింప చేస్తామని తాను చెప్పడం లేదని,అయితే అసాధ్యం కాదని మాత్రమే తాను అంటున్నాని, ఇప్పటికే ప్రయ  త్నాలు ప్రారంభించామని మంత్రి అన్నారు.
7.5%వృద్ధి సాధిస్తాం.
2011-12 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి రేటు తొమ్మిది శాతం ఉంటుందన్న అంచనాల స్థానంలో ప్రస్తుతం 7.5శాతం వృద్ధి  నమోదు అవుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ సైతం ఇదే అభిప్రాయాన్ని శుక్రవారం నాడు వ్యక్తం చేసారు. వృద్ధి వేగంలో తగ్గుదల నమోదు అయిందని, అయితే మిగిలిన నెలలో తిరిగి పుంజుకొని 7.5 శాతం వృద్ధి స్థాయికి చేరుతా మని ఆయన అంగీకరించారు. 2010-11 సంవత్సరంలో జిపిడి వృద్ధి రేటు 8.5 శాతం. జూలై, సెప్టెంబరు త్రైమాసికంలో రెండు సంవ  త్సరాల్లో ఎన్నడూ లేనట్లు ఆర్థికాభివృద్ధి రేటు 6.9 శాతం వద్ద నమోదు అయింది. మొదటి అర్థభాగంలో సరాసరి వృద్ధి రేటు 7.3 శాతం.
రైతులకు మేలు చేస్తుంది
రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐ అనుమతి వల్ల రైతుల కు, వినియోగదారులకు మేలు జరుగుతుందని కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మోంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా శుక్రవారం నాడు మరోసారి చెప్పారు.
సూపర్‌ మార్కెట్ల యజమానులు ఇండియాలో తాము విక్రయించే వస్తువులు కొనకుండా విదేశాల్లో వస్తువులను కొనుగోలు చేస్తారన్న భయాలను కూడా ఆయన తోసిపుచ్చారు. ఇండియాలో  రిటైల్‌ మార్కెట్‌ విలువ 23.10 లక్షలకోట్లమేర ఉంటుందని అంచనా.  ఎఫ్‌డిఐ ని అనుమతించడం వల్ల కిరాణా దుకా ణాలు మూతపడతాయని, ఉపాధి తగ్గిపోతుందని పలురాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి.

No comments:

Post a Comment