Pages

Friday

సామాజిక నెట్‌వర్కింగ్ సైట్లకు మరో దెబ్బ


సామాజిక నెట్‌వర్కింగ్ సైట్లకు దెబ్బ మీద దెబ్బ. మూడు రోజుల వ్యవధిలోనే మరో కోర్టు ఆగ్రహం! సైట్లలో అభ్యంతరకర సమాచారాన్ని ఉంచడంపై విచారణకు సిద్ధం కావాలని ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ మేరకు ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాహూ, యూ ట్యూబ్ తదితర 21 సైట్లకు సమన్లు జారీ చేసింది.

అభ్యంతరకర సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకు తక్షణమే తగిన చ ర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆ చర్యలపై వచ్చే నెల 13వ తేదీలోగా తమ కు నివేదించాలని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుధేశ్ కుమార్ స్పష్టం చేశారు. సైట్లలో అభ్యంతకర సమాచారంపై వినయ్‌రాయ్ అనే పాత్రికేయుడు ప్రైవేటుగా క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు.

No comments:

Post a Comment