Pages

Friday

ఆస్ట్రోఫిజిక్స్ కోర్సు వివరాల..



బీటెక్ (డిస్టెన్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. దేశంలో ఏ యూనివర్సిటీ కూడా బీటెక్‌ను దూరవిద్యా విధానంలో ఆఫర్ చేయకూడదు. ఈ మేరకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) సర్క్యులర్ జారీ చేసింది. కాబట్టి రెగుల్యర్‌గా చదవడం మంచిది. కరస్పాండెన్స్ విధానంలో కొన్ని వర్సిటీలు బీటెక్ కోర్సును అందిస్తున్నాయి. వివరాలు...
* జేఎన్‌టీయూ- హైదరాబాద్: కరస్పాండెన్స్-కమ్-కాంటాక్ట్ పద్ధతిలో బీటెక్ (ఈసీఈ, సివిల్, ఈఈఈ, మెకానికల్, సీఎస్‌ఈ) ఆఫర్ చేస్తుంది. సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.jntuh.ac.in
* ఆంధ్రా యూనివర్సిటీ: బీటెక్-సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, కెమికల్.
అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా.
వెబ్‌సైట్: www.andhrauniversity.info
* ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ- న్యూఢిల్లీ: సివిల్, మెకానికల్ బ్రాంచ్‌లతో కరస్పాండెన్స్ పద్ధతిలో బీటెక్ కోర్సును ఆఫర్ చేస్తుంది.
వివరాలకు: www.ignou.ac.in

.................

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఆఫర్ చేసే కోర్సులు? -రవి, కడప.

ప్యాకేజింగ్‌కు సంబంధించి జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్(ఐఐపీ). ముంబై కేంద్రంగా పని చేసే ఐఐపీకి హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీలలో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. డిజైన్, డెవలప్‌మెంట్, క్వాలిటీ, మెటీరియల్ ఎంపిక, టెక్నికల్ అంశాలకు సంబంధించి పలు ప్రొఫెషనల్ కోర్సులను ఈ సంస్థ ఆఫర్ చేస్తుంది. వివరాలు..

* మూడు నెలల ఫుల్ టైమ్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ ప్యాకేజింగ్
అర్హత: ఏదైనా డిప్లొమా/గ్రాడ్యుయేషన్
* రెండేళ్ల ఫుల్‌టైమ్ పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్
అర్హత: సైన్స్/టెక్నాలజీ/ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్. ఢిల్లీ, ముంబై కేంద్రాల్లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది.
* ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్:
వర్కింగ్ ఎగ్జిక్యూటివ్/ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఒక రోజు లేదా వారం పాటు షార్ట్‌టర్మ్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
* డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్(కరస్పాండెన్స్ కోర్సు): వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఫ్రెష్ డిప్లొమా/గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు.
వివరాలకు: http://iip-in.com/

.......................

మాస్టర్ స్థాయిలో ఆస్ట్రోఫిజిక్స్ కోర్సు వివరాలను తెలపండి? -కవిత, హైదరాబాద్.
నక్షత్రాలు, గెలాక్సీ వంటి ఖగోళ విషయాలను అధ్యయనం చేసే శాస్త్రమే.. ఆస్ట్రోఫిజిక్స్(ఖగోళ భౌతికశాస్త్రం). భౌతిక శాస్త్ర సూత్రాలను ఉపయోగించి ఖగోళ పదార్థాల పరిశోధన, లక్షణాల అధ్యయనం, సంబంధిత డేటా సేకరించడం వంటి అంశాలు ఈ కోర్సులో భాగంగా ఉంటాయి. ఆస్ట్రోఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారు టీచింగ్, పరిశోధన విభాగాల్లో స్థిరపడొచ్చు. దేశ, విదేశాల్లోని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు ఆస్ట్రోఫిజిక్స్‌లో పోస్ట్‌డాక్టోరల్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. మాస్టర్స్ డిగ్రీ చేసిన చాలా మంది అభ్యర్థులు.. పోస్ట్‌డాక్టోరల్ కోర్సుల వైపు మొగ్గు చూపుతారు.

ఈ కోర్సు పూర్తి చేసిన వారికి.. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో), డీఆర్‌డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్),ఏరోస్పేస్ కంపెనీ, శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, సంబంధిత జాతీయ స్థాయి పరిశోధన సంస్థలు లేదా అబ్జర్వేటరీ, సైన్స్ సెంటర్లు, టెలిస్కోప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లు, ప్లానిటోరియంలలో సపోర్ట్ స్టాఫ్, డేటా ప్రాసెసింగ్ అనలిస్టులుగా అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మెడికల్ ఫిజిక్స్, జియోఫిజిక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధిత సంస్థలలో కూడా ఆస్ట్రోఫిజిక్స్ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విభాగాల్లో ఆస్ట్రోఫిజిక్స్ అభ్యర్థులకు అవకాశాలు లభిస్తాయి.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
* ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ).
కోర్సులు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్:
అర్హత: ఎంఎస్సీ/ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్/ ఎంఫిల్ (ఫిజిక్స్ సంబంధిత అంశాల్లో)
* ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ(ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్):
అర్హత: బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్)/ బీఈ/ బీటెక్(ఫిజిక్స్ సంబంధిత అంశాల్లో)
* ఇంటిగ్రేటెడ్ ఎంటెక్-పీహెచ్‌డీ (టెక్-ఆస్ట్రోనమికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్):
అర్హత: ఎంఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ బీఈ/ బీటెక్ (ఫిజిక్స్ సంబంధిత అంశాల్లో)
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
వివరాలకు: www.iiap.res.in
* ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
కోర్సు-ఎంఎస్సీ(ఆస్ట్రోఫిజిక్స్)
అర్హత: బీఎస్సీ(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్)
ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా
వివరాలకు: www.osmania.ac.in

..........................

బీటెక్(ఈసీఈ) చదువుతున్నాను. పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. వివరాలు తెలపండి? -కిరణ్, కర్నూల్.

పరిశోధనల వైపు దృష్టి సారించాలనుకునే వారికి చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నాయి పీహెచ్‌డీ కోర్సులు. పీహెచ్‌డీ పూర్తి చేస్తే శాస్త్ర పరిశోధన సంస్థలతోపాటు వివిధ కళాశాలలు/ యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీగా కూడా స్థిర పడొచ్చు. ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ కోర్సు చేయాలంటే సంబంధిత బ్రాంచ్‌లో ఎంఈ లేదా ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. దేశంలో పలు యూనివర్సిటీలు పీహెచ్‌డీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. వివరాలు.. ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) లతోపాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లు కూడా వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో పీహెచ్‌డీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.

* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ)- బెంగళూరు.
పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఇన్‌స్టిట్యూట్ సొంతంగా నిర్వహించే ఎంట్రెన్స్ లేదా గేట్, నెట్ వంటి పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
వివరాలకు: http://www.iisc.ernet.in*
* బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(బిట్స్)-పిలానీ.
అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచ్‌లో మాస్టర్స్ డిగ్రీ. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది.
వివరాలకు: www.bitsadmission.com
* ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
అర్హత: సంబంధిత/ అనుబంధ బ్రాంచ్‌లో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీతోపాటు ఎంఫిల్. లేదా యూజీసీ-సీఎస్‌ఐఆర్ నెట్/రాష్ట్ర స్థాయిలో నిర్వహించే స్లెట్‌లో క్వాలిఫై లేదా యూనివర్సిటీ గుర్తించిన స్టాండర్డ్ జర్నల్స్‌లో రెండు ఆర్టికల్స్ ప్రచురితం అయి ఉండాలి. వివరాలకు: www.jntu.ac.in 

No comments:

Post a Comment