Pages

Friday

ఫోరెన్సిక్‌ సైన్స్‌లో ఉపాధి



Forensic Science
కొన్ని సందర్భాలలో పోలీసులకంటే నేరస్తులే తెలివైనవారుగా ఉంటారు. తాము ఏ విధంగా నేరం చేస్తే పోలీసులకు పట్టుబడకుండా ఉంటామో ముందే ఊహించి నేరానికి పాల్పడటం వల్ల ఇది సాధ్యమవుతుంటుంది. నేరానికి పాల్పడిన ప్రదేశం లో ఎలాంటి ఆధారాలను, గుర్తులనూ వదిలి పెట్టకుండా నేరస్థులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుం టుంటారు. అలా తెలివిమీరిన నేరస్థులను పట్టుకు నేందుకు పోలీసులు శాస్త్ర సంబంధమైన పద్ధతుల ద్వారా పురోగతి సాధిస్తున్నారు. చట్టం కళ్లుకప్పి తప్పించుకునే దగాకోరుల భరతం పట్టేందుకు ఉపయోగపడుతున్న శాస్త్రాలలో చెప్పుకోదగినది ఫోరెన్సిక్‌ సైన్స్‌.

సంఘటనా స్థలంలో లభించిన తలవెంట్రుకలు, వేలిముద్రలు, రక్తపుచుక్కలు, గోళ్లు వంటి ఏ చిన్న ఆధారంతోనైనా సరే కీలకమైన సాక్ష్యాలను రూపొందించి నేరస్థులను కటకటాల వెనక్కి పంపగలిగే సత్తా ఉన్న శాస్త్రమిది. నేర విచారణలలో ఫోరెన్సిక్‌ శాస్త్రజ్ఞుల పాత్ర ఎంతో పెరుగుతోంది. న్యాయస్థానాలు వారి పరిశోధనలను నిపుణుల సాక్ష్యాలుగా ఆమోదిస్తున్నాయి. క్రిమినలి స్టిక్‌లకు సంబంధించిన వివిధ రంగాల సమ్మేళ నంగా చెప్పవచ్చు.

ఎముకల శాస్త్రంలో గణనీయమైన అభివృద్ధి సాధించిన ఫలితంగా చిన్న దంతం ముక్క దొరికినా ఆ దంతం కలిగిన వ్యక్తి రక్తం గ్రూపు ఏమిటో కూడా తెలుసుకుంటున్నాడు. స్కానింగ్‌, ఎలక్ట్రిక్‌ మైక్రోస్కోప్‌, ఎక్స్‌రే పౌడర్‌ డిఫ్రాక్షన్‌ల సాంకేతిక పరిజ్ఞానం ఫోరెన్సిక్‌ మెడిసన్‌లో నూతన ఆవిష్కర ణలకు, ఇతమిద్ధమైన పరిశోధనలకూ తోడ్పడు తున్నాయి. న్యాయశాస్త్రపరంగా ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ ప్రముఖ పాత్ర వహిస్తోంది. వైద్యవృత్తిని ఎంచుకు న్నవారు మెడికో-లీగల్‌ బాధ్యతలను అంతగా ఇష్టపడడం లేదు.

న్యాయసంబంధ విషయాల పరిశోధనలకే కాక ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ని వృత్తిగా ఎంచుకున్న వ్యక్తి వైద్యశాస్త్రంలో పరిశోధనలు చేసి ఆ రంగంలో అభివృద్ధికి కృషి చేయవచ్చు. న్యాయ శాస్త్రానికి వైద్యవృత్తి అవసరం ఏ విధంగా ఉంటుందో న్యాయవృత్తిలో ఉన్నవారికి కూడా వైద్యానికి సంబంధించిన పరిజ్ఞానం అంతే అవసరం. అందుకనే సాధారణంగా పోలీసులు మెడికో-లీగల్‌ నిపుణుల ట్రెయినింగ్‌ పొందుతుం టారు. వైద్యశాస్త్ర రీత్యా కూడా నేరాన్ని శోధించా లని వారికి ఆదేశాలందుతుంటాయి.

శరీరంలో విషపదార్థాలు ఎంత పరిమాణంలో ఉన్నదీ విశ్లేషిం చడం, చాకచక్యంగా దొంగనోట్లను పట్టివేయడం, రక్త పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులను గుర్తించడం మొదలైన నేరపరిశోధనలు ప్రతిక్షణం సైన్స్‌పై ఆధారపడుతున్నాయి. సాక్ష్యాధారాలను శోధించి నేరపరిశోధనకు, కేసుల పరిష్కరణకు ఉపయోగపడుతున్న ఫోరెన్సిక్‌-శాస్త్ర అన్వయమే అని చెప్పవచ్చు.

పెరుగుతున్న నేరాల నేపథ్యంలో ఫోరెన్సిక్‌ నిపుణుల అవసరం కూడా పెరుగుతూ వస్తోంది. ఆ నిపుణులను అందించేందుకు విద్యాసంస్థలు కూడా కృషి చేస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు ఫోరెన్సిక్‌ సైన్స్‌, క్రిమినాలజీ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సుల్ని ఆఫర్‌ చేస్తున్నాయి. జాతీయ స్ధాయిలో ఫోరెన్సిక్‌ సైన్స్‌లో శిక్షణ, పరిశోధనా వకాశాలను కల్పిస్తున్న సంస్థ. ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రిమినాలజీ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ (ఇసిఎఫ్‌ఎస్‌) ఈ సంస్థను 1972లో న్యూఢిల్లీలో స్థాపించారు.

క్రిమినాలజీకి చెందిన సోషల్‌ సైన్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌లలో ఇంటర్‌ డిసిప్లినరీ ఏరియాలలో పరిశోధన, శిక్షణ నిర్వహించడం ఈ సంస్థ విధి. న్యాయ విచారణ వ్యవస్థలో భాగస్వామ్యం ఉన్న వివిధ జాతీయ సంస్థలకు చెందిన అధికారుల  ఇక్కడ శిక్షణ పొందుతారు. ఈ  సంస్థలో రాష్ట్ర ఫోరెన్సిక్‌ లేబరేటరీస్‌కు చెందినవారు. భారతదేశం లో దిగువ సూచించిన యూనివర్సిటీలు, వివిధ స్ధాయిలలో ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, క్రిమినాలజీ కోర్సులను నిర్వహిస్తున్నాయి.

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు
డాక్టర్‌ హరిసింగ్‌ గౌర్‌ విశ్వవిద్యాలయ, సాగర్‌. బి.ఎ (క్రిమినాలజీ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌)ను ఆఫర్‌ చేస్తోంది. అభ్యర్థులు 12 సంవత్సరాల హయ్యర్‌ సెకండరీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
మణిపూర్‌ వర్సిటీ కాంచీపుర్‌, ఇంపాల్‌: బిఎస్‌సి (ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఒక సబ్జెక్టుగా) అభ్యర్థులు 12వ స్టాండర్డ్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులు
డాక్టర్‌ హరిసింగ్‌ గౌర్‌ విశ్వవిద్యాలయ, సాగర్‌. ఎం.ఎ (క్రిమినాలజీ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌)ను ఆఫర్‌ చేస్తోంది. అభ్యర్థులు బిఎ ఉత్తీర్ణులై ఉండాలి.

కర్ణాటక వర్సిటీ, దర్వార్డ్‌ : ఎం.ఎ క్రిమినాలజీ అండ్‌  ఫోరెన్సిక్‌ సైన్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. అభ్యర్థులు 50 శాతం శాతం మార్కులతో బిఎ, బిఎస్‌సి, బికాం ఉత్తీర్ణులై ఉండాలి.

No comments:

Post a Comment