పాములు పగబడతాయని, ఒక మనిషి తనకు హాని చేస్తే గుర్తుంచుకొని మళ్ళీ అవకాశం వచ్చినపుడు పగ తీర్చుకుంటుందని చాలామంది నమ్మకం. కాని అది ఎంతమాత్రం నిజం కాదు. నిజానికి పాములకు జ్ఞాపక శక్తి తక్కువ. పుట్టలో నుండి బయటకు వచ్చిన పాము ఒక్కొక్కసారి తన పుట్ట ఎక్కడో మరిచిపోయే అవకాశం వుంది. తమ ఆత్మరక్షణ కోసం అంటే ఎవరో తమకు హాని తలపెడుతున్నారనే తలంపుతో బుసకొడుతాయి. లేదా కాటు వేస్తాయి. చాలామంది పాము కరిస్తే 'మంత్రం'ని వేయించుకుంటారు. ఆ మనిషి బ్రతికితే మంత్రం పారిందని చస్తే మంత్రం పారలేదని అనుకుంటారు. కాని అది వాస్తవం కాదు. పాము కరిచిన మనిషి మంత్రంతో బ్రతికితే అతనికి విషయ ఎక్కక పోవడమో లేదా అది విషసర్పం కాక పోవడమో అయివుంటుంది. నిజానికి పాములన్నీ విషసర్పాలు కాదు. ఒక్కొక్కసారి విషసర్పాలు కాటు వేసినా విషం ఎక్కదు. దానికి కారణం అది ఆహారం తీసుకున్న నాలుగైదు గంటల వరకు విషం విడుదల అవదు. ఆ సమయంలో మనిషిని కాటువేస్తే విషం ఎక్కదు. సాధారణంగా పాములు జనసంచారం లేని వేలలో మేతకు వెళతాయి. మధ్యాహ్నం 12గం.ల నుండి సాయంత్రం 4గం. మధ్య అర్థరాత్రి 12గం.ల నుండి తెల్లవారు జామున 4గం.ల మధ్య మేతకు వెళతాయి. తమ స్థావరాలనుండి బయటకు వస్తాయి. కావున ఆ సమయంలో మనిషిని కాటువేస్తే విషం ఎక్కదు. అందువల్ల మనిషి చావడు.పాము కాటు వేస్తే వెంటనే డాక్టరు దగ్గరకు తీసుకొని వెళితే డాక్టరు ఇంజక్షను చేస్తాడు. మనిషి ప్రాణాలు కాపాడవచ్చు. అంతే కాని మంత్రగాని వద్దకు తీసుకెళితే ప్రాణానికే ప్రమాదం, మంత్రాలకు చింతకాయలు రాలవు. పాము కరిచిన వెంటనే ప్రథమ చికిత్స చేయాలి. పాము కరిచిన ప్రదేశానికి కొద్దిగా పైభాగానికి (రక్త ప్రసరణ జరగకుండా) కట్టుకట్టాలిపాము కరిచిన భాగము నుండి నోటితో విషాన్ని పీల్చి ఉమ్మివేయాలి. తదుపరి డాక్టరు దగ్గరకు తీసుకొని వెళితే ఫలితం ఉంటుంది. ఇంటి పరిసర ప్రాంతాలలో పాములు రాకుండా వుండాలంటే మిరియాల పొడిని ఇసుకలో కలిపి చల్లితే పాములు రావు, అంతే గాక ఏదైనా కన్నంలో పాము దూరితే వెల్లుల్లి నూరి ఆకన్నం మీద వేస్తే పాము ఆకన్నం వదిలి వెళ్లిపోతుంది. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే పాములు దరిచేరవు. పాముకాటువేస్తే మాత్రం వెంటనే డాక్టరు దగ్గరకు వెళ్ళాలి. మంత్రాలు వేయించడం, తాయెత్తులు కట్టించడం లాంటివి చేయరాదు.
Pages
▼
Thursday
పాములు పగబడతాయా..?

No comments:
Post a Comment