ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కొందరు అబద్ధాన్ని కూడా ఎంత చక్కగా చెబుతారంటే వారికి ఉండే ఆ కళను బట్టి విస్మయమని పిస్తుంది. అబద్ధాన్ని నర్మగర్భంగా వర్ణించి చెబుతారు. వారి భావాలు, ఆలోచనలు, ప్రవ ర్తనను బట్టి నమ్మితీరాల్సిందే. కానీ ఏదినిజమో, ఏది అబద్దమో దేవుడికి తెలుసు. దాన్ని తెలుసుకున్న దేవుడు అందుకు తగిన ఫలితాన్ని కూడా ఇవ్వకుండా చేతులు ముడు చుకోడు. 'మానక దోషములు చేయువారి వెంట్రుకలుగల నడినెత్తిని ఆయన పగుల గొట్టును (కీర్తన 68:21).
కాబట్టి మనం ఈలోకంలో మనుష్యులకు భయపడక పోయినా దేవుడికి భయపడాలి. ఒకమ్మాయి తన స్నేహితుడికి ఇలా చెబుతున్నది. 'చిన్నదానికి అబద్దం చెప్పవద్దు, పెద్ద వాట ికైతే పర్వాలేదు, కానీ చిన్నచిన్న విషయాలకు అబద్దాలు ఆడవద్దని హితోపదేశాన్ని బోధిం చింది. కాని దేవుడివాక్యం 'యధార్ధముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు (సామెతలు 11:20) చెబుతున్నది.
'అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును (12: 19). అందుకే అబద్ధాలు చెప్పేవారు క్షణాలకే మాటలను మార్చేస్తుంటారు. ఇతరుల ముందు గొప్పగా ఉండాలని, చేసిన తప్పులను కప్పిపుచ్చుకు నేందుకు, ధనాపేక్ష, ఎదుటివారి మెప్పును పొందాలని వంటి కారణాలతో తరచుగా అబ ద్ధాలు చెబుతారు. చిన్నదైనా, పెద్దదైనా, తరచుగానైనా,ఎప్పుడో ఒకసారైనా అబద్ధం అబద్ధమే. దేవుడు దాన్ని తప్పుకిందనే లెక్క కడతాడు. అది నిజం కాదని, మనం చెప్పింది సత్యదూరమని తెలిసినప్పుడు మనమెంత నిందితులుగా మిగిలిపోతామో ఆలోచించాలి.
No comments:
Post a Comment