అదేమి చిత్రమోగానీ చాలా కాలంగా కనిపించకుండా పోయిన ఐదు రూపాయల నోట్లు ఇప్పుడు విరివిగా కనిపిస్తున్నాయి. దుకాణదారులు ఐదు రూపాయల నోటును చూస్తే చాలు నొసలు చిట్లించి, చెల్లదని తిరిగిచ్చేస్తున్నారు. బిచ్చగాళ్లు సైతం తీసుకోడానికి తిరస్కరిస్తున్నారు. ఐదు రూపాయల నోట్లు ఇంకా చలామణిలో ఉన్నాయని రిజర్వు బ్యాంకు ప్రకటించాలి. మీడియా ఆ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. ఐదు రూపాయల నోట్లతో తంటాలు అలా ఉండగా, భారత ప్రభుత్వపు నాణేల ముద్రణ తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఒక రూపాయి, రెండు రూపాయల నాణేలు ఒకేలా ఉంటున్నాయి. ఇక 50 పైసల నాణెం, ఐదు రూపాయల నాణెం కూడా ఒకేలా ఉంటున్నాయి. నిరక్షరాస్యులు, వృద్ధులు, కంటిచూపు సరిగాలేనివారే కాదు, యథాలాపంగా చిల్లర చెల్లించే వారంతా ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ చెల్లించి నష్టపోతున్నారు. పట్టుకుంటేనే తెలిసేలా బరువు, ఆకారం, సైజులలో స్పష్టమైన తేడాలు ఉండేలా నాణేలను ముద్రించడం పట్ల కేంద్రం శ్రద్ధ వహించాలి.
No comments:
Post a Comment