మీరంతా ప్రతిరోజు పత్రికలు చదవాలి వార్తలు వినాలి. విజ్ఞాన సంబంధ కార్యక్రమాలను చూడాలి. మీకు దగ్గరలో ఉన్న గ్రంథాలయానికి వెళ్లి అక్కడ ఉన్న నీతికథల పుస్తకాలను, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను, వ్యక్తిత్వ వికాస పుస్తకా లను చదవాలి. దీని వలన ప్రపంచంలో జరిగే విషయాలను, చారిత్రకాంశాలను, విజ్ఞాన విశేషా లను, సమాజంలో వస్తున్న మార్పు లను తెలుసుకుంటారు.
అలాగే డిస్కవరీ ఛానెల్, ఏనిమల్ ప్లానెట్, హిస్టరీ ఛానెల్‌ను వీక్షించా రంటే విజ్ఞాన సంబంధ విషయాలను మానవ పరిణామక్రమాన్ని, జీవరాశి స్థితిగతులను, చారిత్రక సంపదలను గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.
తరచూ చర్చావేదికలలో పాల్గొ నాలి. వివిధ పోటీలలో పాల్గొనాలి. వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలలో పాల్గొనండి. ఈ పోటీలలో పాల్గొనడం ద్వారా మీలో దాగిన అంతర్గత శక్తులను, సామర్థ్యాలను వెలికి తీసి, సృజనాత్మకతకు పదును పెట్టగలుగుతారు. దీని వలన వివిధ విషయాలపై అవగాహన పెరుగు తుంది.
వివిధ అంశాలను విశ్లేషించ గలుగుతారు. ఆయా అంశాలపై స్వతంత్ర అభిప్రాయాలను వెలి బుచ్చడం ద్వారా మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. సమాజంలో జరిగే సంఘటనలపై నిర్మాణా త్మకంగా ఆలోచించి మీ భావాలను ప్రకటించగలుగుతారు.
సమతులమైన పౌష్టికాహారం తీసుకోండి. విటమిన్లు, ప్రొటీన్లు లోపిస్తే జ్ఞాపకశక్తి తగ్గి, ఐక్యు స్థాయి తగ్గుతుంది.
వ్యాయామం వలన శరీర కండ రాలు ఉత్తేజితమై చురుకుగా పనిచేస్తాయి. యోగా, ధ్యానం వలన మీలో ఏకాగ్రత, ధారణశక్తి పెరిగి మీ ఐ.క్యు స్థాయిని పెంచుతాయి.
మీకు తెలిసిన విషయాల గురించి మీ స్నేహితులతో చర్చించండి. దీని వలన సమస్యపై అవగాహనాశక్తి పెరుగుతుంది. సమస్య పరిష్కా రానికి అవకాశాలు దొరుకుతాయి. రాజకీయ, సామాజిక, సైన్స్ మొదలైన సమకాలీన అంశాలను గురించి మీ అమ్మా,నాన్నలను, ఉపాధ్యాయులను అడిగి తెలుసు కోండి.
దీనివలన విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించండి. నిర్మాణాత్మ కంగా, హేతువాద దృక్పథంతో ఆలోచించండి. ఎందుకు, ఏమిటి? ఎక్కడ, ఎలా? అనే ప్రశ్నలతో ప్రతి విషయాన్ని ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోండి.
No comments:
Post a Comment