Pages

Sunday

బ్రహ్మంగారి కాలజ్ఞానం -3


ఆకలి తీరని ఆశాపిశాచిని
నమ్మినా నిను మ్రింగిపోయేనురా ఆశకు దాసుడు అందరికి దాసుడే ఆశ లేనివాడే మహానీయుడురా !



పరిమిత ప్రజ్ఞగల అల్ప మనస్సునకు
దైవ రహస్యములు అర్ధమే కావయ తన్ను తానూ వశము చేసుకోగలిగితే సర్వమును తెలియును నమ్మండయా ! అనంతమైనట్టి నిఘూఢమైనట్టి సృష్టి రహస్యములు తెలిసింది యెవరయ సృష్టినే తెలియక సృష్టికర్త నువాడు లేడనుచు సులువుగా చెప్పెరయ ! సకల సంపదలుండి సరి లేని భార్యున్న అంతకన్నా నరకమేముందిరా ఆలి మంచిది యైన ఆస్తులెందుకు నీకు అంతకన్నా స్వర్గ మేముందిరా !



ఆస్థి పాస్తుల కొరకు ఆలుబిడ్డల కొరకు
యేడ్చేటి, అజ్ఞానులున్నారయ దైవంబు తలుచుకుని యేడ్చేటి జ్ఞానులు ధన్యులై నరకంబు దాటేరయ ! స్త్రీలు పూజింపబడు దేశమే దేశము దేవతలు సంతుష్టి చెందేరయ శీలమును కాపాడు స్త్రీలున్న దేశమే మహాలక్ష్మి నిలయమని తెలియండయా !


పూర్వ జన్మములోన చేసిన పాపాలే
రోగమై పీడించు ఈ జన్మలో అనుభవించనులేక అన్ని సంపదలుండు యింత కన్నా శిక్ష యేముందిరా !


source :-
templesdiary.com

No comments:

Post a Comment