Pages

Thursday

'ఆసియాన్ ఆఫ్ ది 2011'గా జోగీందర్

లండన్, నవంబర్ 22: లండన్‌కు చెందిన ప్రముఖ ప్రవాస భారతీయుడు జోగీందర్ సంగర్‌ను 2011 ఆసియన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపిక చేశారు. సోమవారం రాత్రి సెంట్రల్ లండన్‌లో జోగిందర్ సంగర్‌ను 'ఆసియన్ హూ ఈజ్ హూ ఇంటర్నేషనల్' ఘనంగా సన్మానించింది. లండన్‌లో భారతీయ విద్యాభవన్‌కు సంగర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తాను వ్యాపార రంగంలో ఎదగడానికి తన కుటుంబ సభ్యు లు ఎంతో దోహదపడ్డారని జోగిందర్ అన్నారు.

బ్రిటన్‌లో వ్యాపారం చేసుకోవడానికి తగిన సౌకర్యాలు, సదుపాయాలు ఉన్నాయని, అన్ని దేశాల కంటే ఇక్కడ చాలా అనుకూలంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పంజాబ్ రాష్ట్రం జలంధర్‌కు చెందిన జోగీందర్ కుటుంబం 50 సంవత్సరాల క్రితమే యునైటెడ్ కింగ్‌డమ్‌కు వలస వెళ్లింది. అక్కడ ఆయన సొంతంగా ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించి వ్యాపారరంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తర్వాత విమానాలను అద్దెకు తీసుకుని నడిపించేవారు. 1965 నుంచి 2000 వరకు భారత్ నుంచి వచ్చిపోయేవారికి వివిధ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ ప్రతినిధిగా ఆయన సేవలందించారు.

No comments:

Post a Comment