Pages

Friday

టెట్ - పేపర్ 2(మాదిరి ప్రశ్నలు)

1. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చింది?
1) 85 2) 86 3) 87 4) 88

2. కౌమార దశను ఒత్తిడి, ఒడిదొడుకులతో కూడుకున్న దశగా పేర్కొన్నవారు?
1) స్టాన్లీ హల్ 2) హర్లాక్
3) ఎరిక్‌సన్ 4) ఫ్రాయిడ్

3. {పజ్ఞ ప్రభావం-విద్యార్థుల నిర్ణయాలపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగ పరిశోధనలో విద్యార్థుల ‘నైతిక నిర్ణయాలు’?
1) స్వతంత్ర చరం 2) పరతంత్ర చరం
3) మధ్యస్త చరం 4) ద్వి చరం

4. టాచిస్టోస్కోప్ దేన్ని మాపనం చేస్తుంది?
1) సృజనాత్మకత 2) అవధాన విస్మృతి
3) స్మృతి-విస్మృతి
4) అవధానం, స్మృతి-విస్మృతి

5. అశాబ్దిక పరీక్షలన్నీ?
1) పేపర్ పెన్సిల్ పరీక్షలు మాత్రమే
2) నిష్పాదన పరీక్షలు మాత్రమే
3) పేపర్ పెన్సిల్, నిష్పాదన పరీక్షలు
4) శక్తి పరీక్షలు మాత్రమే

6. రాజు ప్రజ్ఞ స్థాయికంటే విద్యా సాధన తక్కువ. రాజు ఏ కోవకు చెందిన విద్యార్థి?
1) అభ్యసనా వైకల్యత
2) తక్కువ సాధన ఉన్న విద్యార్థి
3) బుద్ధిమాంద్యుడు
4) వెనుకబడిన విద్యార్థి

7. వీటిలో సరికాని జత?
1) మానవ శాస్త్ర ప్రయోగశాల - ఊంట్
2) కిండర్ గార్డెన్-ఫ్రోబెల్
3) జ్ఞానేంద్రియ ప్రత్యక్షం-మాంటిస్సోరి
4) అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ - స్టాన్లీహల్

8. ‘సాంఘిక క్రమబద్ధ్దత’ పాటించడం కోల్బర్‌‌గ నైతిక వికాసంలో ఏ స్థాయిలో కనిపిస్తుంది?
1) పూర్వ సంప్రదాయ 2) సంప్రదాయ
3) ఉన్నత సంప్రదాయ
4) ఉత్తర సంప్రదాయ

9. X అనే విద్యార్థి మృత్తికల గురించి ఉపాధ్యాయుడు బోధిస్తే విన్నాడు. Y అనే విద్యార్థి బడి తోట పెంపకంలో మృత్తికలు ప్రత్యక్షంగా పరిశీలించి అభ్యసించాడు. X, Y విద్యార్థుల అభ్యసనం జరిగిన పద్ధతులు?

1) X ఉపన్యాస, Y సమస్యా పరిష్కార
2) X ఉపన్యాస ప్రదర్శన, Y ప్రయోగ
3) X ఉపన్యాస,Y ప్రాజెక్ట్ట్
4) X ఉపన్యాస, Y సర్వే

10. Emotional Intelligence: Why it can matter more than I. గ్రంథకర్త
1) డేనియల్ గోల్మన్ 2) గార్డినర్
3) జె.పి.గిల్‌ఫర్డ్ 4) సర్ ఫ్రాన్సిస్ గాల్టన్

11. గిల్‌ఫర్‌‌డ ప్రజ్ఞా సిద్ధాంతంలో 5*6*5 సూచించే విశేషకాలు?
1) విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు
2) విషయాలు, ఉత్పన్నాలు, ప్రచాలకాలు
3) ఉత్పన్నాలు, ప్రచాలకాలు, విషయాలు
4) ప్రచాలకాలు, విషయాలు, ఉత్పన్నాలు

12. యూనిట్ పాఠ్యాంశాలను విడివిడిగా కాకుండా మొత్తం సారాంశం బోధించినప్పుడు విద్యార్థి సులభంగా అవగాహన చేసుకున్నాడు? ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనా సిద్ధాంతం?
1) కార్యసాధక నిబంధనం
2) సంప్రదాయక నిబంధనం
3) యత్నదోష అభ్యసనం
4) అంతర్ దృష్టి అభ్యసనం

13. చార్లెస్ జడ్ ప్రకారం అభ్యసనా బదలాయింపు జరగాలంటే ముఖ్యమైన అంశం?
1) సూత్రాలు నూతన పరిస్థితుల్లో అన్వయించడం
2) మొత్తం సన్నివేశం భాగాల మధ్య సహసంబంధం ఏర్పరచుకోవడం
3) అభ్యసనా పరిస్థితుల్లో పోలికలు వివరించడం
4) ఆదర్శాలను ఒక విలువగా చూడడం

14. భాటియా ప్రజ్ఞా పరీక్షలో రవి మూర్త చిత్రాలను ఒక అర్థవంతమైన మొత్తం నిష్పాదన పరీక్ష ద్వారా అమర్చాడు. గిల్‌ఫర్‌‌డ ప్రకారం రవిలో నెరవేరిన ఉత్పన్నం?
1) విధానాలు 2) యూనిట్లు
3) సంబంధాలు 4) రూపాంతరాలు

15. గిల్‌ఫర్డ్ ప్రకారం జ్ఞాపకశక్తి ఏ విశే షకానికి చెందింది?
1) విషయాలు 2) ప్రచాలకాలు
3) ఉత్పన్నాలు 4) సంబంధాలు

16. సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతాన్ని పేర్కొన్నవారు?
1) కార్‌‌ల రోజర్‌‌స 2) లారెన్‌‌స కోల్బర్‌‌గ
3) చామ్‌స్కీ 4) పియాజే

17. {పాథమిక విద్యా హక్కు చట్టం ప్రకారం 6, 7, 8 తరగతులకు బోధించే ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి?
1) 1:30 2) 1:25 3) 1:35 4) 1:40

18. అతి అభ్యసనం?
1) ధారణ తగ్గిస్తుంది
2) ధారణ పెంచుతుంది
3) విస్మృతికి దారి తీస్తుంది
4) జ్ఞాపకశక్తి తగ్గుతుంది

19. కింది వాటిలో శాబ్దిక పరీక్ష కానిది?
1) బీనె-సైమన్ పరీక్ష
2) రావెన్‌‌స ప్రొగ్రెసివ్ మాత్రికల పరీక్ష
3) కల్మన్ అండర్సన్ పరీక్ష
4) ఆర్మీ ఆల్ఫా పరీక్ష

20. విద్యార్థి వృద్ధుడ్ని రోడ్డు దాటించినప్పుడు ఉపాధ్యాయుడు పొగిడాడు. ఆ పొగడ్తకు ప్రేరితుడైన విద్యార్థి ఆ మంచి పని పునరావృతం చేశాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనా సిద్ధాంతం?
1) శాస్త్రీయ నిబంధనం
2) కార్యసాధక నిబంధనం
3) యత్నదోష అభ్యసనం
4) పరిశీలనా అభ్యసనం

21. Aspects of the theory of Syntax గ్రంథ రచయిత?
1) కోల్బర్‌‌గ 2) థారన్ డైక్
3) చామ్‌స్కీ 4) కార్‌‌లరోజర్‌‌స

22. {పాథమిక విద్యా హక్కు చట్టం 1 నుంచి 8 తరగతుల వరకు ఏ రకమైన పరీక్షా విధానం అమలు చేయాలని పేర్కొంది?
1) రిటెన్షన్ 2) డిటెన్షన్
3) నాన్‌డిటెన్షన్ 4) అటెన్షన్

23. స్మృతిలో అతిముఖ్యమైన అంశం?
1) పునఃస్మరణ 2) గుర్తింపు
3) ధారణ 4) పునరభ్యసనం

24. స్వీయ పోషణ, స్వీయ అభివృద్ధి, స్వీయ పరిపూర్ణత అనే భావనలు పేర్కొన్నవారు?
1) చామ్‌స్కీ 2) కార్‌‌లరోజర్‌‌స
3) కోల్బర్‌‌గ 4) పియాజె

25. సాంఘిక ఆర్థిక అంతస్థు-నైతిక వికాసం మధ్య కార్య కారక సంబంధం తెలుసుకోవాలనుకున్న ప్రయోగ పరిశోధనలో ‘సాంఘిక ఆర్థిక అంతస్థు’?
1) స్వతంత్ర చరం 2) పరతంత్ర చరం
3) మధ్యస్థ చరం 4) ద్వి చరం

26. గణిత ఉపాధ్యాయుడంటే భయమేర్పరచుకున్న విద్యార్థి గణితం పేరు చెప్పగానే భయపడడం?
1) సామాన్యీకరణం
2) విచక్షణ 3) పునర్బలనం
4) ఉన్నత క్రమనిబంధనం

27. వీటిలో అశాబ్దిక పరీక్ష కానిది?
1) ఆర్మీ బీటా పరీక్ష
2) భాటియా ప్రజ్ఞా పరీక్ష
3) రావెన్‌‌స ప్రొగ్రెసివ్ మాత్రికల పరీక్ష
4) స్టాన్‌ఫర్‌‌డ - బీనె ప్రజ్ఞా మాపని

28. ఏ దశలోని పిల్లలకు భావనల అవగాహనకోసం ప్రత్యక్ష అనుభవాలు తప్పనిసరి?
1) మూర్త ప్రచాలక 2) నియత ప్రచాలక
3) అమూర్త ప్రచాలక 4) పూర్వ ప్రచాలక

29. ‘బడితె పూజ’కు భయపడి బడి నియమాలు పాటించే బాలుడు కోల్బర్‌‌గ ప్రకారం ఏ దశకు చెందుతాడు?
1) 1 2) 2 3) 3 4) 4

30. పునఃస్మరణ మాపన పద్ధతి కానిది?
1) ద్వంద్వ సంసర్గలు 2) కథనాలు
3) పునరభ్యసనం 4) స్మృతి -విస్మృతి

31. ఆలోచనల్లో కొత్తదనం పియోజె ప్రకారం ఏ దశకు సంబంధించిన లక్షణం?
1) పూర్వ ప్రచాలక 2) మూర్త ప్రచాలక
3) అమూర్త ప్రచాలక 4) సంవేదన చాలక

32. ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రవేశించిన వెంటనే విద్యార్థులు నిల్చోవడం ఏ అభ్యసనం?
1) యత్న దోష 2) కార్యసాధక
3) పరిశీలనా 4) శాస్త్రీయ

33. రావెన్‌‌స ప్రొగ్రెసివ్ మాత్రికల పరీక్షకు సంబంధించని అంశం?
1) అశాబ్దిక పరీక్ష 2) సామూహిక పరీక్ష
3) శక్తి పరీక్ష 4) నిష్పాదన పరీక్ష

34. పిల్లలు పుట్టుకతో భాషను ఆర్జించే సామర్థ్యం కలిగి ఉంటారని పేర్కొన్నవారు
1) కార్‌‌ల రోజర్‌‌స 2) వైగాట్‌స్కీ
3) చామ్స్‌స్కీ 4) పియాజె

35. కోల్బర్‌‌గ ప్రకారం తోటి వ్యక్తులపై జాలి, కరుణ చూపించే విశాల్ నైతిక దశ?
1) 6 2) 5 3) 4 4) 3

36. బోధన - అభ్యసనం అనే రెండు చరాల మధ్య ప్రయోగ పరిశోధనా ఫలితాలు రాబట్టాలనుకున్న పరిశోధకుడు పరిశీలించాల్సిన స్వతంత్ర చరం?
1) బోధన 2) అభ్యసనం
3) బోధన, అభ్యసనం 4) పైవేవీ కాదు

37. స్మృతికి సంబంధించి వీటిలో?
1) పునఃస్మరణ కంటే గుర్తింపు కష్టం
2) గుర్తింపు కంటే పునఃస్మరణ కష్టం
3) పునఃస్మరణ, గుర్తింపు రెండూ సమానం
4) పైవేవి కాదు

38. రాజు తన తోటి విద్యార్థులు పాటించే నియమాలు పాటించడు. తన స్వీయ ఇష్టంతో నియమాలు పాటిస్తాడు. రాజు కోల్బర్‌‌గ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతాడు?
1) 4 2) 2 3) 3 4) 5

39. ఇతర జీవులతో పోల్చితే మానవుల్లో భాషా వికాసం జన్మతః సిద్ధిస్తుందని పేర్కొంది?
1) కోల్బర్‌‌గ 2) పియోజె
3) రోజర్‌‌స 4) చామ్‌స్కీ

40. బడితోట అనే ప్రాజెక్ట్‌లో వేర్వేరుగా ఉన్న పాఠ్యాంశాలు కలిపి బోధించినప్పుడు ఆ విద్యార్థి అవగాహన చేసుకున్నాడు. ఇందు లో ఇమిడి ఉన్న అభ్యసనా సిద్ధాంతం?
1) అంతర్ దృష్టి
2) శాస్త్రీయ నిబంధనం
3) కార్యసాధక నిబంధనం
4) యత్న దోష అభ్యసనం

41. చిన్నపిల్లలు ఆడే అమ్మనాన్నల ఆట ఏ దశకు సంబంధించింది?
1) సంవేదన చాలక 2) పూర్వ ప్రచాలక
3) మూర్త ప్రచాలక
4) నియత ప్రచాలకదశ

42. విస్మృతికి సంబంధించిన పావ్‌లోవ్ నియమం?
1) ఉన్నత క్రమనిబంధనం
2) విలుిప్తీ కరణం 3) విచక్షణ
4) సామాన్యీకరణం

43. గుర్తింపు సంక్షోభం ఎవరికి సంబంధించిన భావన?
1) ఫ్రాయిడ్ 2) హర్లాక్
3) ఎరిక్‌సన్ 4) ఆడ్లర్

44. {పజ్ఞ-నైతిక విలువల మధ్య ప్రయోగాత్మక పరిశోధన జరపాలనుకున్న పరిశోధకుడు పరీక్షించాలనుకునే పరతంత్ర చరం?
1) ప్రజ్ఞ 2) పరిసరాలు
3) నైతిక విలువలు
4) విద్యార్థుల అభ్యసనం

45. ఉపాధ్యాయుడు విద్యార్థులతో ఆడుతూ పరిశీలించడం వల్ల కలిగే ప్రయోజనం?
1)సహజ ప్రవర్తన తెలుసుకోవచ్చు
2)కృత్రిమ ప్రవర్తన తెలుసుకోవచ్చు
3) ఉద్వేగాలు,ఇంగితాలు గమనించొచ్చు
4)విద్యార్థులతో ఉపాధ్యాయుడు సన్నిహితంగా మెలగొచ్చు

46. {పతిభావంతుడికి అనుసరించాల్సిన పద్ధతి?
1) అంతఃపరీక్ష 2) కేస్‌స్టడీ
3) పరిశీలనా 4) ప్రయోగ

47. లైంగిక వికాసంలో శిశువు తన శరీరం ద్వారా తృప్తి చెందిన తర్వాత స్వలింగీయుల ద్వారా, తర్వాత విభిన్న లింగీయుల ద్వారా తృప్తి చెందుతారు. దీని ప్రకారం వికాసం?
1) ఏకకృత మొత్తం 2) సంచితమైంది
3) క్రమానుగతమైంది
4) అవిచ్ఛిన్నమైంది

48. చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు అనే సూక్తులను సమాజంలో సాంఘిక క్రమబద్ధత కోసం పాటిస్తే ఆ విద్యార్థి కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి చెందుతాడు?
1) ఉత్తర సంప్రదాయ 2) సంప్రదాయ
3) పూర్వ సంప్రదాయ
4) ఉన్నత సంప్రదాయ

49. స్పియర్‌మన్ ప్రకారం సాధారణ పరిజ్ఞానం ఉన్న విద్యార్థిలో పనిచేయని కారకం?
1) ఎ 2) ఓ 3) 4) ఎ

No comments:

Post a Comment